AP: ప్రపంచంలోనే వాజ్పేయీ వంటి నేత ఉండటం అరుదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. ప్రతి జిల్లాలో వాజ్పేయీ విగ్రహావిష్కరణ చేపట్టినట్లు తెలిపారు. విగ్రహావిష్కరణ ఆలోచన రాగానే సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లినట్లు చెప్పారు. తమకు కూడా అత్యంత ఇష్టమైన నాయకుడు వాజ్పేయీ అని చంద్రబాబు తనతో చెప్పారని మాధవ్ వెల్లడించారు.