కోనసీమ: టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణరావు 10వ వర్ధంతిని అమలాపురంలో ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, మెట్ల రమణబాబుతో కలిసి కిమ్స్ ఆసుపత్రి సమీపంలోని సత్యనారాయణరావు స్మృతివనంలో నివాళులు అర్పించారు.