NDL: ఆత్మకూరులోని గౌడ్ సెంటర్లో మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాజ్ పేయి చిత్రపటానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి పాలాభిషేకం చేస్తూ నివాళులర్పించారు. ఆయన దేశ రాజకీయాల్లో చేసిన సేవలు భారత్ అభివృద్ధికి చేసిన కృషిని కొనియాడారు. భారతీయ రాజకీయాల్లో శాంతి అభివృద్ధి ప్రగతికి ఆయన చూపిన మార్గం నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు.