WG: ఇరగవరం మండలం కంతేరు గ్రామంలో ఇవాళ జరిగిన అగ్ని ప్రమాదంలో గడ్డివాము దగ్ధమైంది. గ్రామంలోని నివాసాల మధ్య గడ్డివాముకు మంటలు వ్యాపించినట్లు వచ్చిన సమాచారంతో తణుకు నుంచి ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ప్రమాదంలో సుమారు పది ఎకరాల గడ్డివాము దగ్ధమైనట్లు ఫైర్ సిబ్బంది తెలిపారు.