ELR: ఉంగుటూరు MLA క్యాంపు కార్యాలయంలో ఇవాళ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. MLA పత్సమట్ల ధర్మరాజు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం తుదివరకు పోరాడిన గొప్ప వ్యక్తి వాజ్ పేయి అని ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో BJP నియోజకవర్గ ఇన్ఛార్జ్ శరణాల మాలతీ రాణి పాల్గొన్నారు.