MBNR: బాలానగర్ మండలంలో HYD జలవిహార్ విహారయాత్రకు వెళ్తున్న మణికంఠ కళాశాల విద్యార్థుల బస్సు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. అదే సమయంలో అటుగా వెళ్తున్న మంత్రి వాకటి శ్రీహరి ఘటన స్థలంలో ఆగి పరిస్థితిని పరిశీలించారు. పోలీసుల నుంచి వివరాలు తెలుసుకుని క్రేన్ ద్వారా బస్సును తొలగించించారు. గాయపడిన విద్యార్థులను పరామర్శించి ధైర్యం చెప్పారు.