AP: ఎన్టీఆర్కు వాజ్పేయి ఎంతో సన్నిహితంగా ఉండేవారని సీఎం చంద్రబాబు అన్నారు. ‘వాజ్పేయి గొప్ప మానవతావాది, మంచి కవి. ఆయన హయాంలోనే టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. పీపీపీ విధానంలో దేశం అభివృద్ధి చెందుతుందని వాజ్పేయి భావించారు. అమెరికా ఆంక్షలు లెక్క చేయకుండా ముందుకు సాగిన ధీశాలి. అణుపరీక్షలు నిర్వహించి భారత్ సత్తా చాటారు’ అని తెలిపారు.