ఈరోజు 16 గ్రామాల ప్రజలు కలిసి MLC బీటీ నాయుడుకు 16 గ్రామాలను ఆదోనిలోనే ఉంచాలని గురువారం వినతిపత్రం అందజేశారు. తమ గ్రామాలను ఆదోనిలోనే కొనసాగించాలని గ్రామ ప్రజలు కోరారు. 16 గ్రామాలకు ఆదోని మండలం దగ్గరవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు చిన్న గోపాల్ రెడ్డి, బసాపురం రామస్వామి, షాషావలి, పాల్గొన్నారు.