క్రీడాకారుల ఎంపికలో బంధుప్రీతి 2014లోనే అంతమైందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ‘సంసద్ ఖేల్ మహోత్సవ్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘2014కు ముందు జట్లకు క్రీడాకారుల ఎంపికలో అవినీతి, అక్రమాలు ఉండేవి. ఈ విధానానికి ముగింపు పలికి దశాబ్దమైంది. ప్రస్తుతం పేద కుటుంబాల పిల్లలు ప్రతిభ, కష్టపడే తత్వంతో క్రీడల్లో రాణిస్తూ ఉన్నత స్థానాలకు చేరుకుంటున్నారు’ అని తెలిపారు.