ATP: CM చంద్రబాబు నాయుడిని రాష్ట్ర వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ ఛైర్పర్సన్ స్వప్న ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడ సెక్రటేరియట్లో జరిగిన ఈ సమావేశంలో వీరశైవ లింగాయతులను ఓబీసీ జాబితాలో చేర్చాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. తమ సామాజిక వర్గ స్థితిగతులను వివరించి, పార్టీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.