ASF: చైనీస్ మాంజా అమ్మకం, వినియోగం చట్టరీత్యా నేరమని జిల్లా SP నిఖితా పంత్ ఇవాళ ఓ ప్రకటనలో హెచ్చరించారు. చైనీస్ మాంజా నైలాన్, సింథటిక్ దారంతో, గాజుపొడి పూతతో తయారై ఉండటం వల్ల అత్యంత ప్రాణాంతకమన్నారు. మాంజా అమ్మకం లేదా రవాణా చేస్తే భారీ జరిమానాతో పాటు ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందన్నారు.