HYD: గ్రేటర్ HYD మూడు జిల్లాల్లో సుమారు 615 మద్యం దుకాణాలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ప్రతి దుకాణానికి 100 చదరపు మీటర్ల పర్మిట్ రూము తప్పనిసరి. కానీ.. పలుచోట్ల కాలనీల్లోనే మద్యం సేవించడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా నాగారం 10 సత్యనారాయణ కాలనీ, కేపీహెచ్బీ ప్రాంతాల్లో నివాసాల మధ్యే వైన్ షాపులు ఉన్నాయని వాసులు ఆందోళన వ్యక్తం చేశారు.