GNTR: జిల్లాలో ధనుర్మాసం శోభనిచ్చే హరిదాసుల గానం క్రమంగా మూగబోతోంది. ఒకప్పుడు తంబురా, చిడతలతో ‘హరిలో రంగ హరి’ అంటూ వీధుల్లో తిరిగేవారు. నేడు పట్టణీకరణ, అపార్ట్మెంట్ సంస్కృతి, వారసత్వం అందకపోవడంతో ఈ కళ మసకబారుతోంది. కొన్నిచోట్ల బైక్‌లపై స్పీకర్లతో వస్తున్నా పాతకాలపు భక్తిభావం కనిపించడం లేదు. 70, 80ల నాటి ఆ తీపి జ్ఞాపకాలే ఇప్పుడు మిగిలాయి.