GNTR: తెనాలి మండలం ఎరుకలపూడి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షునిగా గురువారం టీడీపీ సీనియర్ నాయకుడు కావూరి చంద్రమోహన్ నియమితులయ్యారు. నియోజకవర్గ పరిధిలోని ఐదు పీఎసీఎస్లకు ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన పాలకవర్గాన్ని ప్రకటించింది. ఛైర్మన్గా చంద్రమోహన్, సభ్యులుగా సాంబశివరావు, దుర్గారావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా వారిని MLC ఆలపాటి రాజేంద్రప్రసాద్ అభినందించారు.