E.G: రాజమండ్రి రూరల్ మండలం రాజవోలులో భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్‌పేయ్ 101 జయంతి కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మత్సేటి ప్రసాద్ హాజరై వాజపేయ్ చిత్రపటానికి పూలమాలనేసి నివాళులర్పించారు. ఆయన జీవితం స్వచ్ఛమైన నాయకత్వం, దేశభక్తికి ప్రతీక అని కొనియాడారు.