AP: దేశం గర్వించే అరుదైన నాయకుల్లో వాజ్పేయి ఒకరని సీఎం చంద్రబాబు కొనియాడారు. ‘రాష్ట్రంలో 26 జిల్లాల్లో వాజ్పేయి విగ్రహాలు ఏర్పాటు చేశాం. ఆయన ఘనకీర్తి అందరికీ తెలిసేలా స్మృతివనం ఏర్పాటు చేస్తాం. వాజ్పేయి ఓ యుగపురుషుడు. ఆయన శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం సంతోషకరం’ అని పేర్కొన్నారు.