NRML: HYDలోని గాంధీభవన్లో తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అధ్యక్షతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘ప్రియదర్శిని ఉడాన్ యోజన’లో భాగంగా నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు దుర్గా భవానికి 200 ఉడాన్ శానిటరీ న్యాప్కిన్లను ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో భైంసా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఠాకూర్ పూజదత్తుసింగ్ తదితరులు పాల్గొన్నారు.