MNCL: బెల్లంపల్లి మండలం బుచ్చయ్య పల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి తీసుకువచ్చేందుకు అధిక నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలని సర్పంచ్ మహేశ్వర్ కోరారు. గురువారం కార్మిక శాఖ మంత్రికి వినతిపత్రం అందజేశారు.గ్రామం నుంచి మండల కేంద్రం,మందమర్రి, శంకర్ పల్లికి వెళ్లేందుకు రోడ్డు లేక గ్రామస్థులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.