AP: విశాఖ రిషికొండపై బీజేపీ MLA విష్ణుకుమార్ రాజు హాట్ కామెంట్స్ చేశారు. ‘మంత్రుల కమిటీ మా అభిప్రాయాలు తీసుకోలేదు. మా అభిప్రాయాలు తీసుకోకుండా మంత్రుల కమిటీ నిర్ణయం తీసుకుంటే ఎలా? ప్రజాభిప్రాయం తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలి. స్థానిక MLAలు, ఎమ్మెల్సీలు, ఎంపీల అభిప్రాయం తీసుకోవాలి. ఆరేళ్లుగా రుషికొండ మూసేశారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.