PLD: పిడుగురాళ్ల మండలంలోని చిన్న అగ్రహారం గ్రామానికి చెందిన మేకల సాంబశివరావుకు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులుగా అధిష్టానం అవకాశం కల్పించారు. సాంబశివరావు మాట్లాడుతూ.. జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులుగా రెండవసారి నియమితులైనందుకు ఎమ్మెల్యే యరపతినేనికి ధన్యవాదాలు తెలిపారు. టీడీపీలో కష్టపడ్డ ప్రతి ఒక్కరికి ప్రతిఫలం లభిస్తుందని ఆయన అన్నారు.