HYD: గాంధీనగర్లో నూతనంగా నిర్మించిన భారతీయ మజ్దూర్ సంఘ్ కార్యాలయం – దత్తోపంత్ థేంగడి భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ హాజరయ్యారు. కార్మికుల సంక్షేమం, శ్రమ గౌరవాన్ని ప్రతిబింబించే జాతీయ భావజాలానికి ఈ భవన్ బలమైన కేంద్రంగా నిలవాలని వారు ఆకాంక్షించారు.