పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైజీరియాలో విషాద ఘటన చోటుచేసుకుంది. మైదుగురిలో ఉన్న మసీదులో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. దాదాపు 35 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. అంతేకాదు పేలుడు ధాటికి మసీదు ధ్వంసమైంది. ఇది ఉగ్రవాదుల చర్య అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.