ఉన్నావో రేపు కేసులో ప్రధాన నిందితుడు కుల్దీప్ సెంగార్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇవ్వడంపై CBI సీరియస్ అయ్యింది. కుల్దీప్ బయటకు వస్తే కేసుపై ప్రభావం పడే అవకాశముందని వాదించిన CBI.. బాధితురాలి భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. సెంగార్ శిక్షను సస్పెండ్ చేస్తూ HC ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని తెలిపింది.