SDPT: స్టేషన్ ఘనపూర్లో ఈనెల 23, 24వ తేదీల్లో జిల్లాస్థాయి ఆటల పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో చేర్యాల పట్టణానికి చెందిన పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు వాలీబాల్ పోటీలో ప్రథమ బహుమతి అందుకున్నారు. ఈ సందర్భంగా పీటీ శశిధర్ రెడ్డిని విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ శ్రీరామ్ కుమార్ అభినందించారు. విద్యార్థులకు మొదటి బహుమతి రావడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.