WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని జీసస్ గాస్పల్ బాప్టిస్ట్ చర్చిలో గురువారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ రెడ్డి మత్తయ్య మాట్లాడుతూ.. యేసుక్రీస్తు ప్రేమ, త్యాగమే క్రిస్మస్ యొక్క ప్రధాన సందేశమని అన్నారు. సమాజంలో శాంతి, సోదరభావం, ఐక్యత పెంపొందించేందుకు యేసు చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని పిలుపునిచ్చారు.