కృష్ణా: అమరావతి సమీపంలోని వెంకటపాలెంలో ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పాయ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గుడివాడ ఆర్డీవో బాలసుబ్రమణ్యం, తదితర అధికారులు కేంద్ర మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.