KMR: పిట్లంలోని హరిహరసుత అయ్యప్ప స్వామి ఆలయంలో గురువారం రక్తదాన శిబిరం నిర్వహించారు. బాన్సువాడ ఏరియా ఆసుపత్రి రక్త నిధి, రెడ్ క్రాస్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ పిలుపు మేరకు మాలధారణలో ఉన్న పలువురు అయ్యప్ప స్వాములు స్వచ్ఛందంగా రక్తదానం చేసి తమ ఉదారతను చాటుకున్నారు.