SRD: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కేవల్ కిషన్ 65 వర్ధంతి సందర్భంగా మెదక్ పట్టణంలో ఈనెల 26వ తేదీన నిర్వహించే జాతర జయప్రదం చేయాలని కోరుతూ సంగారెడ్డిలోని ముదిరాజ్ సంఘం భవనంలో పోస్టర్లను గురువారం ఆవిష్కరించారు. మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు మందల వరలక్ష్మి మాట్లాడుతూ.. జాతరకు ముదిరాజ్ కులస్తులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.