HYD: హైదరాబాద్కు చెందిన సివిల్ ఇంజినీర్ వివేకానందరెడ్డి, ఆర్కిటెక్ట్ సాధన దంపతులు మొయినాబాద్లో వినూత్నంగా ‘మట్టి ఫాంహౌస్’ను నిర్మించారు. ఎర్రమట్టి, సున్నం, ఎండుగడ్డి వంటి సహజ వనరులతో ‘ఎర్త్ బ్యాగ్’ పద్ధతిలో గూళ్లను పోలిన ఐదు నిర్మాణాలు చేపట్టారు. ఈగూళ్లపై పిరమిడ్ ఆకృతిని నిర్మించి, లోపల మంచాలను కూడా మట్టితోనే రూపొందించారు.