VKB: క్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని జిల్లా ప్రజలందరికీ, ముఖ్యంగా క్రైస్తవ సోదరీసోదరులకు జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శాంతి, కరుణ, ప్రేమ, సహనానికి నిలువుటద్దం ఏసుప్రభువు అని కొనియాడారు. ఆయన బోధనలు సమాజంలో సోదరభావాన్ని పెంపొందించడమే కాకుండా, మానవాళిని సరైన మార్గంలో నడిపిస్తాయని పేర్కొన్నారు.