NLG: శాంతి, కరుణ, ప్రేమ, సేవ వంటి యేసు క్రీస్తు బోధనలు సర్వమానవాళికి ఆచరణీయమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం కేతేపల్లి మండలం రాయపురం చర్చిలో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.