W. G: నరసాపురం మండలం పెదమైనవానిలంక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో నిర్వహించే లైవ్ పెయింటింగ్ పోటీలకు కేపీపాలెం జడ్పీ హైస్కూల్ విద్యార్థి ఎంపికయ్యాడు. ఈ మేరకు హెచ్ఎం ఇందిర ఇవాళ వివరాలు వెల్లడించారు. ఈనెల 28న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తన దత్తత గ్రామమైన పీఎం లంకలో పర్యటించనున్నారు. పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ఆమె బహుమతులు అందజేయనున్నారు.