రంజీ ట్రోఫీలో జమ్మూకశ్మీర్ టీమ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఢిల్లీతో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో జమ్మూ ఘన విజయం సాధించింది. రంజీ ట్రోఫీ చరిత్రలో ఇప్పటివరకు ఇరు జట్లు 43 సార్లు తలపడ్డాయి. అయితే ఢిల్లీపై జమ్మూ విజయం సాధించడం మాత్రం ఇదే తొలిసారి.