ఢిల్లీ పేలుడు కేసును NIAకి అప్పగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో పేలుడు ఘటన సంబంధించిన ప్రాథమిక నివేదికను NIA అధికారులు కేంద్రానికి సమర్పించనున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలు ప్రాంతాల్లో అధికారులు ముమ్మరంగా సోదాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా పలువురిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ పేలుడు ఘటనలో ఇప్పటి వరకు 12 మంది మృతి చెందారు.