ఇంటర్నెట్ అవసరం లేని యూజర్లకు ఎయిర్టెల్ షాకిచ్చింది. తన రూ. 189 వాయిస్ – ఓన్లీ ప్లాన్ను రద్దు చేసింది. కేవలం కాలింగ్ ఫీచర్ కావాలనుకునే వారికి ఈ మార్పు భారంగా మారనుంది. ప్రస్తుతం ఎయిర్టెల్ ఎంట్రీ-లెవల్ ప్లాన్ రూ. 199గా మారింది. ఈ ప్లాన్ 28 రోజుల వాలిడిటితో రోజుకు 100 SMSలు, అపరిమిత వాయిస్ కాలింగ్, 2GB డేటాను అందిస్తుంది.