SKLM: ఎక్సైజ్ శాఖ మద్యం బెల్టుషాపులు నిర్వహణపై ఉక్కుపాదం మోపింది. అందులో భాగంగా వజ్రపుకొత్తూరు గ్రామంలో మంగళవారం 26 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు ప్రోహిబిషన్, ఎక్సైజ్ CIమల్లికార్జునరావు చెప్పారు. బెల్టు షాపులకు మద్యం సరఫరా చేస్తే వారి లైసెన్స్ దుకాణాలపై కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఆంక్షలను అతిక్రమించిన వారికి రూ. 50 వేలు ఫైన్ విధిస్తామన్నారు.