ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక జవహర్లాల్ నెహ్రూ స్టేడియాన్ని కూల్చివేయడానికి కేంద్రం సిద్ధమవుతోంది. ఈ స్టేడియానికి సంబంధించిన 102 ఎకరాల స్థలంలో అత్యాధునిక వసతులతో ‘స్పోర్ట్స్ సిటీ’ని నిర్మించబోతున్నారు. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధమయ్యాయి. త్వరలోనే ఈ పనులు ప్రారంభం కానున్నాయి. 1982లో నిర్మించిన ఈ స్టేడియాన్ని 2010లో రూ.900 కోట్లతో ఆధునీకరించారు.