NGKL: కల్వకుర్తి పట్టణంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరాన్ని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివరాం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం రోగులకు పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. ప్రజలు ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మహిత ఆసుపత్రి డాక్టర్ యశోద భాయి, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ బాలయ్య పాల్గొన్నారు.