KMR: బాన్సువాడ పట్టణం నుంచి బొల్లక్ పల్లికి వెళ్లే ప్రధాన రహదారిలోని వంతెనపై ఏర్పడిన గుంతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వంతెన ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించడంతో ప్రస్తుతం దారుణంగా మారిందని స్థానికులు తెలిపారు. దీంతో అక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోయారు. అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.