MDCL: బాలానగర్‌లోని సెంట్రల్ టూల్ డిజైనింగ్ కేంద్రంలో నవంబర్ 15న డిప్లొమా ట్రైని పోస్టులకు సంబంధించి ప్లేస్మెంట్ డ్రైవ్ ఉంటుందని అధికారులు తెలిపారు. డిప్లొమా ఇన్ టూల్ డై & మౌల్డ్ మేకింగ్ (DTDM) – 2022, 2023, 2024 & 2025, డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన వారు అర్హులుగా పేర్కొన్నారు. ఆసక్తి గలవారు CV, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లతో రావాలన్నారు.