MHBD: జిల్లా మెడికల్ కాలేజీలో DMST, DECG పారామెడికల్ కోర్సులకు అడ్మిషన్లు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ లకావత్ వెంకట్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులు ఆన్లైన్ దరఖాస్తుతో పాటు విద్యార్హత ఒరిజినల్, జిరాక్స్ సెట్‌తో ఈ నెల 27న సాయంత్రం 6 గంటలకు సమర్పించాలన్నారు. వివరాలకు https://www.tgpmb.telangana.gov.in సంప్రదించాలని సూచించారు.