KMR: కామారెడ్డి మండలం ఇస్రోజివాడి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. తూకం, తేమ శాతం పరిశీలించి, పారదర్శకంగా కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో 427 కేంద్రాల ద్వారా 1.23 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేసి 11,196 మంది రైతులకు రూ. 145 కోట్లు చెల్లించినట్లు తెలిపారు.