TG: రాష్ట్రమంత్రుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కరప్షన్ చేయడంలో నంబర్ 1 అని BJP ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. జగిత్యాలకు మంజూరైన కేంద్రీయ విద్యాలయానికి ఇరిగేషన్ శాఖకు సంబంధించిన భూమిని ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి వాటాలు ఉంటేనే పనులు జరుగుతాయని ఎద్దేవా చేశారు.