HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల కోడ్ ఉల్లంఘనలపై బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం BRK భవన్లోని ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల ప్రధాన అధికారిని కలిసిన వారిలో మాజీ కార్పొరేషన్ ఛైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, తదితరులు ఉన్నారు.