ASF: జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. తిర్యాణి మండలం గోండుగూడ, తోయగూడ గ్రామాల్లో పులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. మంగళవారం పులి దాడిలో రెండు ఆవులు మృతి చెందాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అటవీ ప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. పులి సంచారంపై అటవీ సిబ్బంది పరిశీలన ప్రారంభించారు.