MNCL: నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని రైతుల వద్ద కొనుగోలు చేస్తామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం లక్షెట్టిపేట మండలంలోని మోదెల, ఇటిక్యాల, గంపలపల్లి గ్రామాలలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్య, అధికారులతో కలిసి ప్రారంభించారు. రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్మ వద్దన్నారు.