TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ కాసేపట్లో ముగియనుంది. పలుచోట్ల చెదురుముదురు ఘటనలు మినహా.. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు 47.16 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల్లో ఇంకా ఓటర్లు ఉండటంతో, తుది పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.