SKLM: ఆత్మ నిర్భర భారత్ అభియాన్లో భాగంగా కొత్తూరు మండలంలో ఇంటింటికి, షాపులల్లో బీజేపీ జిల్లా కార్యదర్శి కాపలా దమయంతి ఆధ్వర్యంలో మంగళవారం ఆత్మని ర్భర భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. స్వదేశీ వస్తువులను ప్రతి భారతీయుడు కొనుగోలు చేసి వినియోగించాలని అన్నారు. ‘ప్రతి ఇంటా స్వదేశీ – ఇంటింటా స్వదేశీ’ నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.