NRML: విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరేందుకు NCC శిక్షణ ఎంతో తోడ్పడుతుందని ఆదిలాబాద్ 32 బెటాలియన్ సుబేదార్ జగదీప్ సింగ్ పేర్కొన్నారు. జుమేరాత్ పేట్ హైస్కూల్లో వారం రోజుల నుంచి కొనసాగుతున్న క్యాడేట్ల శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. NCC శిక్షణ పొందిన విద్యార్థులకు ఎంతో మెరుగైన భవిష్యత్తు ఉందన్నారు. ఉపాధి అవకాశాలలో సైతం మంచి అవకాశాలు ఉన్నాయన్నారు.