WGL: 2024 DSCలో స్పోర్ట్స్ కోటా SGT నియామకాల్లో జాతీయ క్రీడాకారులకు అన్యాయం జరిగిందన్న ఆరోపణలతో ప్రభుత్వం రీవెరిఫికేషన్ చేయగా 22 మంది అనర్హులుగా తేలారు. విద్యా, స్పోర్ట్స్ శాఖల సమన్వయ లోపంతో అర్హత లేని వారు ఉద్యోగాల్లో ఉన్నట్లు తెలిసింది. నివేదిక బయటపెడితే అనర్హుల ఉద్యోగాలు రద్దు కావచ్చనే కారణంతో ఫైలును దాచుతున్నారన్న విమర్శలు వచ్చాయి.